స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఈరోజు ఓ మోటివేషనల్ పోస్ట్ పెట్టింది. పూజ చేస్తున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘కొన్నిటిని ఎదుర్కోవడానికి మన బలం సరిపోదు. మనపై మనకున్న నమ్మకం మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ నమ్మకమే మన గురువుగా, స్నేహితుడిగా మారుతుంది. అది మనల్ని మానవాతీత శక్తిగా నిలబెడుతుంది’’ అని రాసుకొచ్చింది. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ పోస్ట్ పై స్పందించింది. ‘నేను దీనిని పూర్తిగా అంగీకరిస్తున్నాను’ అంటూ సమంత పోస్ట్ కి ఓ హార్ట్ ఎమోజీని కూడా షేర్ చేసింది.