'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లకు రాబోతుంది హీరోయిన్ మాళవికా నాయర్. తెలుగుతో పాటు మలయాళ చిత్రాలలో కూడా నటించే ఈ బ్యూటీ స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటుంది.
ఈ సినిమా తదుపరి మాళవిక ఒక బిగ్ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్టుగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నందమూరి కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ ప్రెస్టీజియస్ మూవీ 'డెవిల్' లో తాను హీరోయిన్ గా నటించబోతున్నట్టు రివీల్ చేసింది.
నవీన్ మేడారం డైరెక్షన్లో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.