నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన రెండవ సినిమా "దసరా". కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు.
నిన్నే దసరా ట్రైలర్ విడుదలై, పాన్ ఇండియా భాషల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ విషయం పక్కన పెడితే, టీజర్, నాని లుక్, లిరికల్ సాంగ్స్.. ఇలా ప్రతి విషయంలో ఈ సినిమాను కొంతమంది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప తో పోల్చి చూస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల కావడంతో, మరోసారి దాసరిని పుష్పతో కంపేర్ చెయ్యడం స్టార్ట్ చేసారు.
ఈ నేపథ్యంలో నాని దసరా సినిమాని పుష్పతో కంపారిజన్ చెయ్యడంపై క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. జుట్టు, బనియన్, లుంగీ..విషయంలో తప్ప పుష్పతో ఈ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. దసరా చూసిన తరవాత ఒకవేళ ఎవరైనా ఇలాంటి లుక్ లో కనిపిస్తే, దసరా లుక్.. కదా అని ఖచ్చితంగా అనుకుంటారు.. అని పేర్కొన్నారు.