ఈ మధ్య టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సినిమాలలో "బలగం" ఒకటి. వేణు ఎలదండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన బలగం మూవీ రోజు రోజుకూ బాక్సాఫీస్ వద్ద బలంగా మారుతూ డ్రీం థియేట్రికల్ రన్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం, విడుదలైన పన్నెండవ రోజు అంటే నిన్న సింగిల్ హైయెస్ట్ వర్కింగ్ డే కలెక్షన్లు వచ్చాయని సగర్వంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ శుక్రవారం కబ్జా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి వంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి, ఈ నేపథ్యంలో బలగం థియేట్రికల్ రన్ ఎలా ఉండబోతుందో..చూడాలి