మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
PVT 04 సినిమా ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు రాబోతుందని చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ మెల్లగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ మేరకు సాయంత్రం 04:05 నిమిషాలకు ఈ సినిమా నుండి 'ఈవిల్ జైంట్' ని పరిచయం చెయ్యబోతున్నాం అంటూ మేకర్స్ ఎనౌన్స్ చేసారు.