ఈ నెల 22న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి సిద్ధమైన విశ్వక్ సేన్ కొత్త చిత్రం "దాస్ కా ధమ్కీ". ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
లిరికల్ సాంగ్స్, రెండు ట్రైలర్లతో ఆడియన్స్ లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ సృష్టించిన ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో రెండ్రోజుల్లో జరగబోతుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను మేకర్స్ కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ మేరకు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మార్చి 17 సాయంత్రం ఆరింటి నుండి ధమ్కీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని తెలుస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్ గా పాల్గొంటారు.