"దసరా" సినిమాతో నాచురల్ స్టార్ నాని ఫస్ట్ టైం పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మార్చి 30న గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
ఈ లోపు చిత్రబృందం ముమ్మర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ, దసరా పై ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దసరా ప్రమోషన్స్ ని నాని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. చెన్నై, ముంబై, కొచ్చి, కోల్కతా ...ఇప్పుడు బెంగుళూరు .... ఇలా అన్ని ముఖ్య నగరాలలో నాని దసరా ప్రమోషన్స్ చేస్తున్నారు.
తాజాగా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ఫస్ట్ టైం ట్విట్టర్ లో #AskNani పేరిట ప్రేక్షకాభిమానులతో ఇంటిరాక్షన్ సెషన్ ని నిర్వహించనున్నారు.