బాలీవుడ్ నుండి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం "పఠాన్". షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడిగా వ్యవహరించారు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్గా నటించారు.
హిందీ, తెలుగు, తమిళ భాషా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న "పఠాన్" మూవీ థియేటర్లకు వచ్చి ఆరు వారాలు కావొస్తున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద చాలా మంచి కలెక్షన్లను నమోదు చేస్తుంది. బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలింగా చరిత్రకెక్కిన ఈ సినిమా ఈ రోజుతో 50 రోజుల బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.