ఫిబ్రవరి 18న విడుదలైన "వినరో భాగ్యము విష్ణుకథ" చిత్రం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ టాక్ తో థియేట్రికల్ రన్ జరుపుకుంది. తాజాగా ఈ నెల 22 నుండి ఉగాది సందర్భంగా ఈ సినిమా ఆహా ఓటిటిలో డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ మేరకు ఆహా సంస్థ నుండి అధికారిక ప్రకటన కూడా జరిగింది.
కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మల్టీ జానర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా, అల్లు అరవింద్ గారు సమర్పకులుగా వ్యవహరించారు.