లిరికల్స్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న చిత్రం "రంగమార్తాండ". కృష్ణవంశీ దర్శకత్వంలో, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా, మరాఠీ సూపర్ హిట్ చిత్రం "నట్ సామ్రాట్" కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతుంది.
కొన్ని రోజుల నుండి స్పెషల్ ప్రీమియర్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు మార్చి 22 న రంగమార్తాండ థియేటర్లకు రాబోతుందని తెలుస్తుంది.
చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుంది అని కృష్ణవంశీ గారిని తెగ మెచ్చుకుంటున్నారు. మనకు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు ఇచ్చి, మనల్ని అలరించిన ఈ లెజెండ్ యొక్క లేటెస్ట్ మూవీ రంగమార్తాండను మార్చి 22న థియేటర్లలో చూసి ఆయన పట్ల మన ప్రేమను మరోసారి చూపిద్దాం.