హీరో నవీన్ బేతిగంటి నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా "రామన్న యూత్". ఈ సినిమాలో అమూల్య రెడ్డి హీరోయిన్ గా నటిస్తుంది. కమ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఓ సుందరి' ప్రోమో విడుదలయ్యింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్లీ డ్యూయెట్ గా రూపొందిన ఈ పాటను ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఫుల్ సాంగ్ రేపు విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజిని నిర్మిస్తున్నారు.