ఫైనల్లీ.. బాలీవుడ్ బాక్సాఫీస్ ని గత రెండున్నర నెలలుగా ఏకఛత్రాధిపత్యం చేస్తున్న "పఠాన్" మూవీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో పఠాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతుంది.
సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్గా నటించారు. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్ జరుపుకుంటూ, కొత్త సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతుంది.