రేపు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్న "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" నుండి కాసేపటి క్రితం రిలీజ్ ట్రైలర్ విడుదలయ్యింది. గతంలో విడుదలైన ట్రైలర్ తరహాలోనే ఇది కూడా ఫీల్ గుడ్ లవ్, రొమాంటిక్, డ్రామా ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది.
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మిస్తున్నారు.