నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈనెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ముమ్మర ప్రచార కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి రీసెంట్గా విడుదలైన చమ్కీల అంగీలేసి లిరికల్ వీడియో మరియు ట్రైలర్లకు ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. మరైతే, ఇప్పుడు ఈ రెండు కూడా యూట్యూబ్ ట్రెండింగ్ #1 పొజిషన్లో దూసుకుపోతూ యూట్యూబ్ ని కబ్జా చేసాయి. చమ్కీల అంగీలేసి పాట యూట్యూబ్ మ్యూజిక్ టాప్ #1 లో, ట్రైలర్ యూట్యూబ్ #1లో ట్రెండ్ అవుతున్నాయి.