"అన్స్టాపబుల్ విత్ NBK" బ్లాక్ బస్టర్ టాక్ షో తదుపరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఆహా ఓటిటిలో 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఈ షోలో పాల్గొనబోయే బాలయ్య అల్ట్రా స్టైలిష్ లుక్ కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేసాయి.
తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో యొక్క ప్రోమోను విడుదల చేసారు. 'గాలా విత్ బాలా' టైటిల్ తో విడుదలైన ఈ ప్రోమోలో టాప్ 12 కంటెస్టెంట్లతో కలిసి బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ చూడొచ్చు. వారికి బాలయ్య తన స్టైల్ లో ఇచ్చే జడ్జిమెంట్ ను చూడొచ్చు. ఫుల్ ఎపిసోడ్ మార్చి 17, 18, 19 తేదీలలో స్ట్రీమింగ్ కాబోతుంది.