ఈ రోజు నుండి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" నుండి లేటెస్ట్ గా 'నీలిమేఘ మాలవో' అనే క్లాసికల్ సాంగ్ విడుదలయ్యింది. విశేషమేంటంటే, ఈ పాటను డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి పాడారు. ఒరిజినల్ సాంగ్ ని రవి కంపోజ్ చెయ్యగా, కళ్యాణి మాలిక్ రీమిక్స్ చేసారు. జీకే మూర్తి లిరిక్స్ అందించారు.
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమాను శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మిస్తున్నారు.