బ్యూటీఫుల్ హీరోయిన్ హన్సికా మోత్వాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తాజాగా తన వీకెండ్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.యంగ్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరీ ముఖ్యంగా యూత్ లో మయా క్రేజ్ దక్కించుకున్న ఈ యాపిల్ బ్యూటీ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసుకుంది. కొన్నేండ్ల పాటు టాలీవుడ్ నూ ఊపూపింది.
ఇక పెళ్లి తర్వాత హన్సికా మోత్వానీ తన భర్తతో కలిసి వేకేషన్స్, టూర్స్ కు వెళ్తూనే ఉంది. మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సందర్భంగా తమ వెకేషన్స్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతోనూ పంచుకుంటోంది. తాజాగా వీకెండ్ సందర్భంగా ఓ రిసార్ట్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. అకకడి నుంచి పలు ఫొటోలను పంచుకుంది. చేతికి ఆర్కిటిక్ పూలను చుట్టుకొని.. కాజువల్స్ లో సింపుల్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లోకేషన్స్ లో ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.