గత సంవత్సరం కోలీవుడ్ లో '96' చిత్రం ఘన విజయం సాధించింది. విజయ్ సేతుపతి మరియు త్రిష వారి పాత్రలలో జీవించారు. '96' చిత్రంపై గతంలో అక్కినేని కోడలు సమంత స్పందిస్తూ, ఇదో అద్భుతమైన చిత్రమని, దీన్ని రీమేక్ చేయకపోవడమే మంచిదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దిల్ రాజు దీనిని తెలుగులో రీమేక్ చేస్తుండగా, త్రిష స్థానంలో నటించే చాన్స్ ను సమంత కొట్టేసింది.
ఇక సమంత గతంలో చేసిన కామెంట్లపై స్పందించిన దిల్ రాజు, ఈ సినిమా రీమేక్ హక్కులను ఎవరు కొనుగోలు చేశారో, ఎవరు నటించనున్నారో తెలియక సమంత అప్పట్లో ఆ కామెంట్ చేసుంటారని అన్నాడు. అసలు విషయాన్ని ఆమె ఊహించివుంటే ఈ వ్యాఖ్యలు వచ్చుండేవి కాదన్నాడు. కాగా, తమిళవర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.