టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమా కెరియర్ లో హిట్ చిత్రాల వరుసలో 'మన్మధుడు' మరిచిపోలేనిది.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసింది అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నారు .. అది ఇప్పటికి కుదిరింది.
నాగార్జున హీరోగా .. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు వుంటుందట. ఒక కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పాయల్ కి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఆల్రెడీ రవితేజ సినిమాలోనూ ఆమె ఒక కథానాయికగా ఎంపికైంది. నాగార్జున సరసన తగిలిన ఛాన్స్ ఆమె కెరియర్ మరింత స్పీడ్ గా ముందుకు తీసుకెళుతుందేమో చూడాలి.