కార్తీ-రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో వచ్చిన 'ఖాకీ ' చిత్రం బ్లాక్ బస్టర్ ని చేరింది. ఇప్పుడు మళ్ళీ వాళ్లిద్దరూ కలిసి చేసిన చిత్రం 'దేవ్' ఈ నెల 14 వ తేదీన రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. కాగా ట్రైలర్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో కార్తి క్యారెక్టర్ తో పాటు, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ క్యారెక్టర్స్ కూడా ఇంట్రస్టింగ్ గా అనిపించాయి. అలాగే ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ కూడా సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని చెబుతుంది.
కాగా ఈ చిత్రంలో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువస్తున్నారు.