యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం చేస్తున్న కొత్త చిత్రం "దాస్ కా ధమ్కీ". నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మరో రెండ్రోజుల్లో అంటే మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో హీరో కం డైరెక్టర్ విశ్వక్ సేన్ తిరుపతికి బయలుదేరి వెళ్లారు. తిరుమల కొండకు కాలినడకన ప్రయాణం చేసి, ఈ రోజు తెల్లవారు ఝామున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని దివ్య ఆశీస్సులను అందుకోనున్నారు.
ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. కరాటే రాజు నిర్మించారు.