లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో రూపొందుతున్న "పొన్నియన్ సెల్వన్ 2" సినిమా వచ్చే నెల 28వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ మేరకు సాయంత్రం ఆరింటికి 'ఆగనందే' అనే బ్యూటిఫుల్ లవ్ మెలోడీ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. హీరో కార్తీ, హీరోయిన్ త్రిషల మధ్య సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాట ఉండబోతుందని తెలుస్తుంది.
చియాన్ విక్రం, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.