విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్త, అనన్య నాగళ్ల ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "అన్వేషి". ఈ సినిమాను VJ ఖన్నా డైరెక్ట్ చేస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఏదో ఏదో కలవరం'... అని సాగే బ్యూటిఫుల్ అండ్ మెలోడియస్ లవ్ సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, దీప్తి పార్థసారథి ఆలపించారు. చైతన్య వర్మ లిరిక్స్ అందించారు.