టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య రీసెంట్గానే "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో రన్ అవుతుంది.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 6గా తెరకెక్కుతున్న ఒక యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం, నాగసౌర్య కెరీర్ లో 23వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఉగాది కానుకగా మార్చి 22న రివీల్ కాబోతుందని తెలుస్తుంది.