మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గారు ఈ మధ్య సంగీతం అందించిన తెలుగు చిత్రాలలో "రంగమార్తాండ" ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఉగాది కానుకగా మార్చి 22న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
తాజాగా రంగమార్తాండకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గారు అందించిన మ్యాజికల్ ఆల్బం విడుదలయ్యింది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన షాయరీ, నన్ను నన్నుగా ఉండనీవుగా, సోల్ ఆఫ్ రంగమార్తాండ, పొదల పొదల గట్ల నడుమ, దమిడి సేమంతి పాటలు ఒకటికి మించి ఒకటి అన్నట్టుగా ఇళయరాజా గారు స్వరపరిచారు.