గ్లిమ్స్ వీడియోతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన "గేమ్ ఆన్" చిత్రం నుండి ఇటీవలే ఫస్ట్ సింగిల్ 'రిచో రిచ్' లిరికల్ వీడియో విడుదలై, యూత్ ఆడియన్స్ నుండి విశేష స్పందన దక్కించుకుంటుంది. డబ్బులేని జీవితానికి, డబ్బున్న జీవితానికి వ్యత్యాసం తెలుపుతూ సింగర్స్ అసుర, రికీ బి ఆలపించిన ఈ పాటకు అసుర లిరిక్స్ అందించారు. నవాబ్ గ్యాంగ్ సంగీతం అందించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమాకు దయానంద్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రవి కస్తూరి నిర్మిస్తున్నారు.