ఈ నెల 22న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి సిద్ధమైన విశ్వక్ సేన్ కొత్త చిత్రం "దాస్ కా ధమ్కీ". విడుదల తేదీ అతి దగ్గరలో ఉండడంతో ధమ్కీ చిత్రబృందం వినూత్న ప్రచారానికి తెరతీసింది. ఈ మేరకు ఈ రోజు రాత్రి ఏడున్నరకు హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో మూవీ హీరో హీరోయిన్లు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ టికెట్ కౌంటర్ వద్ద ఆడియన్స్ కి టికెట్లు అమ్మబోతున్నారు. అలానే రేపు రాత్రి ఏడున్నరకు ప్రసాద్ ఐమ్యాక్స్ లో కూడా టికెట్లను అమ్మబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది.
ఈ సినిమాకు విశ్వక్ సేన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కరాటే రాజు నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.