RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పేరు విశ్వవ్యాప్తం అయ్యింది. ఇటీవలే 95వ అకాడెమీ అవార్డుల కార్యక్రమాన్ని ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన తారక్ ఈ గురువారం నుండి ఎన్టీఆర్ 30 తో బిజీగా మారనున్నారు.
మరి, తమ హీరో USA లో ముమ్మర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, తమకు మరింత దగ్గర కావడంతో USA అభిమానులు తారక్ పై తమకున్న ఆకాశమంత ప్రేమను అదే రీతిలో చూపించి వార్తల్లో నిలిచారు. ప్రెస్టీజియస్ హాలీవుడ్ సిగ్నేచర్ పై ఆకాశమంత ఎత్తులో 'థాంక్యూ NTR ... కాంట్ వెయిట్ ఫర్ ఎన్టీఆర్ 30' అనే ఏరోప్లేన్ బ్యానర్ ని ఎగురవేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.