యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన కొత్త సినిమా "దాస్ కా ధమ్కీ" విడుదల మరో రెండ్రోజుల్లో ఉండబోతుండడంతో, ఈ రోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కాలినడకన చేరుకొని, శ్రీవారి దివ్యాశీస్సులు పొందారు. అర్చకులు విశ్వక్ సేన్ కి వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందించారు.
ధమ్కీ చిత్రానికి విశ్వక్ సేన్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. కరాటే రాజు నిర్మిస్తున్నారు.