కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం "జవాన్". లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సంజయ్ దత్ కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ తో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో కూడా సంజయ్ పాల్గొంటున్నారట. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
పోతే, ఈ సినిమా జూన్ 2, 2023న హిందీ, తమిళ్, తెలుగు భాషలలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa