మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రావణాసుర". సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. ప్రస్తుతం రావణాసుర మ్యూజికల్ ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రవితేజ ఒక వినూత్న ప్రచారానికి రెడీ అయ్యారు. నాచురల్ స్టార్ నాని తో కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఆ వేదికపై నాని దసరాని, రవితేజ రావణాసుర ను ప్రమోట్ చెయ్యనున్నారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోగ్రాం కూడా షూట్ చెయ్యబడింది. మరి, అతి త్వరలోనే మంచి శుభదినం నాడు ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పోతే, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా దసరా మార్చి 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa