నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం "మంత్ ఆఫ్ మధు". 2015లో విడుదలైన త్రిపుర సినిమాలో తొలిసారిగా జంటగా నటించిన నవీన్ చంద్ర, స్వాతి తిరిగి ఈ సినిమాలో మరోసారి జోడిగా నటిస్తున్నారు.
శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుండి గతేడాది విడుదలైన టీజర్ ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ యొక్క ఆడియో రైట్స్ ని సరిగమ మ్యూజిక్ లేబుల్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా నుండి చిత్రబృందం ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇవ్వబోతుంది.
అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. యశ్వంత్ ముల్లుకుట్ల నిర్మిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa