'త్రిపుర' తదుపరి హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ కలర్స్ స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం "మంత్ ఆఫ్ మధు". శ్రీకాంత్ నాగోతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుండి గతేడాది విడుదలైన టీజర్ ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ దక్కించుకుంది.అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, రాజీవ్ ధరావత్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. యశ్వంత్ ముల్లుకుట్ల నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మంత్ ఆఫ్ మధు నుండి అతి త్వరలోనే మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.