'మళ్ళి మళ్ళి నువ్వే ఎదురెదురోస్తే' అనే బ్యూటిఫుల్ మెలోడితో శ్రోతలను ఆకట్టుకున్న "ఏజెంట్" నుండి లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఏందే ఏందే ... అనే సాంగ్ యొక్క ప్రోమోను మార్చి 22న, ఫుల్ లిరికల్ వీడియోను మార్చి 24న విడుదల చెయ్యబోతున్నట్టు తెలుపుతూ మేకర్స్ నుండి స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. హిప్ హప్ తమిజ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.