శ్రీనివాసు కాకర్ల దర్శకత్వంలో సింగిల్ క్యారెక్టర్ మూవీగా రూపొందింన చిత్రం "హలో మీరా". లుమియర్ సినిమా బ్యానర్ పై పద్మ కాకర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు చిన్నా సంగీతం అందించారు. గార్గేయి ఎల్లాప్రగడ ప్రధానపాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా నుండి 'నా కనులలో నా కలలలో' ఫుల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. ఈపాటను సమీరా భరద్వాజ్ ఆలపించగా, శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ అందించారు. రేపు పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి జీవితంలో ఈ రోజు ఎదురైన అనుకోని క్లిష్ట పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొంది? అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమా యొక్క ట్రైలర్ గతంలో విడుదల కాగా ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది.