'ఓం శాంతి' తదుపరి హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ 'న్యూసెన్స్'. తెలుగు ఓటిటి ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందుతున్న న్యూసెన్స్ లో వీరిద్దరూ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మీరు చూసే ప్రతి న్యూస్ నిజమేనా? ఇదే నిజం అని చూపిస్తున్నారా?... అనే ట్యాగ్ తో గతంలో ఆల్రెడీ ఒక టీజర్ విడుదల కాగా, తాజాగా టీజర్ 2.O పేరుతో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మేకర్స్ మరొక టీజర్ ని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు. హీరో రానా దగ్గుబాటి న్యూసెన్స్ టీజర్ 2.O ని లాంచ్ చెయ్యబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ని ప్రవీణ్ పూడి డైరెక్ట్ చేస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.