టాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సినిమాల్లో 'డీజే టిల్లు' ఒకటి. ఈ చిత్రానికి సీక్వెల్‌ను మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజా అప్‌డేట్ ప్రకారం, టిల్లు స్క్వేర్ జూన్ 2 లేదా జూన్ 23న విడుదల కావచ్చు అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు తేదీలలో ఒకటి త్వరలో లాక్ చేయబడుతుంది మరియు ఆ తర్వాత అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి వెలువడనుంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.