నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా మహా శివరాత్రి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా, ఈ సినిమా మార్చి 22న ఆహా వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ విలేజ్ డ్రామాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.