ఇండియన్ సినిమా క్లాసిక్ హిట్స్ గా చెప్పుకోదగిన సినిమాలలో "3ఇడియట్స్" ఒకటి. బాలీవుడ్ దిగ్గజ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరానీ రూపొందించిన ఈ యూత్ ఫుల్ కామెడీ డ్రామా 2009లో విడుదలై, సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కరీనా కపూర్ స్వయంగా ఈ విషయంపై ఒక వీడియోను విడుదల చేసింది. ఐతే, ఈ వీడియోలో ఆమె ఖచ్చితంగా సీక్వెల్ అని చెప్పలేదు కానీ, సీక్వెల్ పై హింట్ ఐతే ఇచ్చింది. మరి, మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఈ సినిమాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి టైట్యులర్ రోల్స్ లో నటించగా, బొమన్ ఇరానీ కీరోల్ లో నటించారు. విధు వినోద్ చోప్రా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa