టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన టైటిల్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు. 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. టీమ్ విడుదల చేసిన ఇంటెన్స్ పోస్టర్‌లో చరణ్ తన మేకోవర్‌తో కూల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.