రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమా అక్టోబర్ 20న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.