మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29, 2023న సాయంత్రం 6 గంటల నుండి జరుగుతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ వేడుకకు విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.