శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని "దసరా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 34.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
యాక్షన్ డ్రామాగా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
'దసరా' ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::::::
నైజాం : 13.7 కోట్లు
సీడెడ్ : 6.5 కోట్లు
UA : 3.9 కోట్లు
ఈస్ట్ : 2.35 కోట్లు
వెస్ట్ : 2 కోట్లు
గుంటూరు : 3 కోట్లు
కృష్ణ : 2 కోట్లు
నెల్లూరు : 1.2 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 34.65 కోట్లు