'శాకుంతలం' సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధంలో తాను పూర్తిగా నిజాయితీగా ఉన్నానని, కానీ అది వర్కౌట్ కాలేదని చెప్పారు. తాను తప్పు చేసిన దానిలా ఎందుకు దాక్కోవాలని, చేయని తప్పుకు ఎందుకు బాధపడాలని సమంత అన్నారు. విడాకుల తర్వాత పుష్ప ఐటెం సాంగ్ లో నటించే ఛాన్స్ వచ్చిందని, చాలా మంది తనను ఆ సాంగ్ చేయొద్దని చెప్పారని సమంత తెలిపింది.