బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలియా భట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఈమె తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనటువంటి ఆలియా అనంతరం ఈమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమాని కూడా తెలుగులో విడుదల చేశారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆలియా ప్రస్తుతం పాపకు జన్మనివ్వడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.
ఇక ఈమె నటుడు రణబీర్ కపూర్ తో రిలేషన్ లో ఉంటూ గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత ఏడాది నవంబర్ నెలలోనే ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ప్రస్తుతం కూతురి ఆలన పాలన చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్నటువంటి అలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె తన పెళ్లి గురించి మాట్లాడుతూ పెళ్లిలో తనకు బోర్ కొట్టిన క్షణాల గురించి వెల్లడించారు. పెళ్లిలో తనకు చాలా బోర్ కొట్టిన క్షణం ఏదైనా ఉందా అంటే అది కేవలం మెహందీ పెట్టే సమయం అని సమాధానం చెప్పారు. ఇలా తన చేతులకు మెహేంది పెడుతున్న సమయంలో ఒక చిన్న పాప ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం తనకు చాలా బోర్ కొట్టిందని ఈ సందర్భంగా తన మెహందీ ఫంక్షన్ గురించి అలియా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.