జబర్దస్త్ యాంకర్ గా సూపర్ పాపులర్ అయిన అనసూయ క్షణం సినిమా నుంచి సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరవడం మొదలు పెట్టింది. రెగ్యులర్ పాత్రలతో కాకుండా అనసూయ సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా సినిమాలు చేస్తూ వస్తుంది.అప్పుడప్పుడు లీడ్ రోల్స్ చేస్తూ స్టార్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే సినిమాల్లో నటిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త, పుష్ప( లో దాక్షాయణి పాత్రలో అనసూయ అలరించింది. అయితే అనసూయని స్పూర్తిగా తీసుకుని మరో యాంకర్ ఆమె బాటలోనే నడుస్తుంది.
ఆమె ఎవరో కాదు తెలుగు ప్రముఖ యాంకర్ శ్యామల బిగ్ బాస్ కి కూడా వెళ్లొచ్చిన శ్యామలా తన మార్క్ యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ప్రస్తుతం సాయి ధరం తేజ్ విరూపాక్ష సినిమాలో శ్యామల పార్వతమ్మ పాత్రలో నటించింది. ఈ సినిమాతో నటిగా మారి ఇక మీదట వరుస సినిమాలు చేయాలని చూస్తుంది శ్యామల. కచ్చితంగా శ్యామల సినిమాలు చేస్తే ఆమెకు వెండితెర మీద మంచి ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో అక్క, వదినల పాత్రలకు శ్యామల పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆమె యాంకరింగ్ వదిలకున్నా సినిమాలు వరుసగా చేస్తే ఆమె క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.