కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ట్రైలర్ మరియు ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా మూవీ టీమ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ని నిర్వహించింది.
తాజాగా ఇప్పుడు, ఈ మిస్టిక్ థ్రిల్లర్‌కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయటానికి లీడ్ పెయిర్‌ను ప్రదర్శిస్తూ ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల కానుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.