క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగమార్తాండ' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమా మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కి రీమేక్. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన రంగమార్తాండ హౌస్‌ఫుల్ మూవీస్ మరియు రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత అందిస్తున్నారు.