ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అని, అందుకే బయట కలిసి కనిపించడం లేదని రూమర్లు వినిపించాయి. తాజాగా ఓ నెటిజన్ ఐశ్వర్య, ఆరాధ్య ఫోటో షేర్ చేస్తూ నా ఫేవరెట్ పీపుల్ అంటూ కామెంట్ చేసింది. దీనికి అభిషేక్ స్పందిస్తూ నాకు కూడా వారిద్దరు ఫేవరేట్ అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో విడాకుల రూమర్స్ ను పరోక్షంగా కొట్టిపడేశాడు.