కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ చిత్రం "రంగమార్తాండ" ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రంగస్థల నటుల జీవితాన్నే కథాంశంగా తీసుకుని అమ్మా, నాన్నల కథగా ఈ దృశ్యకావ్యాన్ని దర్శకుడు కృష్ణవంశీ అద్భుతంగా తెరకెక్కించగా, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న రంగమార్తాండ చిత్రం నిన్నటి నుండి ప్రముఖ OTT మీడియం అమెజాన్ ప్రైమ్ ద్వారా పెద్ద స్క్రీన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల్లోనే ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ నుండి సూపర్ క్రేజ్ అందుకుని ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతున్న టాప్ 10 మూవీస్ లో మొదటి స్థానంలో నిలిచింది.
![]() |
![]() |